Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ముఖ్యంగా బుధవారం(ఏప్రిల్27) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాలిక్ 5 వికెట్లు సాధించి సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించనప్పటికీ.. ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓటమి తప్పలేదు. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన మాలిక్.. గంటకు 155 కి.మీ వేగంతో బంతిని వేయాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. "ఫాస్ట్ బౌలింగ్, లైన్ అండ్ లెంగ్త్ మెయింటెయిన్ చేసి వికెట్లు పడగొట్టడమే నా ప్రణాళిక.
అందులో భాగంగానే హార్దిక్ భాయ్‌ను బౌన్సర్‌తో ఔట్ చేశా, సాహాను యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాను. వాంఖడే చిన్న మైదానం కాబట్టి స్టంప్స్‌నే లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేశాను" అని మ్యాచ్ అనంతరం చెప్పాడు. అదే విధంగా 155 కి.మీ స్పీడుతో బంతిని ఎప్పుడు వేస్తారని అడిగిన ప్రశ్నకు.. "ప్రస్తుతం బ్యాటర్‌కు సరైన ప్రదేశాల్లో బౌలింగ్ చేయడంపై దృష్టి పెట్టాను. దేవడు సంకల్పిస్తే.. ఏదో ఒక రోజు 155 కి.మీ వేగంతో బంతిని వేస్తాను" అని మాలిక్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'ఉమ్రాన్ మాలిక్ హరికేన్'.. ప్రశంసలు కురిపించిన మాజీ కేంద్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment