
PC: IPL.com
ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పీడ్‌గన్ ఉమ్రాన్ మాలిక్ తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. పంజాబ్‌తో జరిగిన ఎస్ఆర్‌హెచ్ అఖరి మ్యాచ్‌లో ఉమ్రాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. కాగా శనివారం (ఏప్రిల్ 23) ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగించాలని మాలిక్ భావిస్తోన్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన మాలిక్ 10 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని ఔట్‌చేయడమే లక్ష్యంగా మాలిక్ పెట్టుకున్నాడు.
అదే విధంంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను ఔట్ చేయాలని అనుకున్నట్లు ఉమ్రాన్ తెలిపాడు. "కేఎల్ రాహుల్‌ని ఔట్ చేయాలనుకున్నాను. లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడినప్పడు అతడిని ఔట్ చేయడానికి ప్రయత్నించాను. మా తదుపరి మ్యాచ్‌లో మేము ఆర్సీబీతో ఆడనున్నాం.
ఈ మ్యాచ్‌లో కోహ్లి భాయ్‌ని ఔట్ చేయడమే నా లక్ష్యం. నేను ఈ ఇద్దరు ఆటగాళ్లకు (రాహుల్, విరాట్ కోహ్లి) పెద్ద అభిమానిని. ఈ మ్యాచ్‌లో అతడిని ఔట్ చేయడానికి వంద శాతం ఎఫెక్ట్ పెడతాను. మిగితాది ఆ దేవుడు చేతిలో ఉంది" అని మాలిక్ పేర్కొన్నాడు. ఇక గతేడాది సీజన్‌లో మాలిక్ బౌలింగ్‌ను ఎదుర్కొన్న కోహ్లి.. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
చదవండి: IPL 222: 'కోహ్లి, రోహిత్ త్వరలోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతారు'
Comments
Please login to add a commentAdd a comment