పాకిస్తాన్ క్రికెట్ ప్రపంచానికి ఎంతో మంది పేస్ బౌలర్లను పరిచయం చేసింది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి దిగ్గజ బౌలర్లు పాక్ గడ్డ నుంచి వచ్చినవారే. తాజాగా మరో యువ పేస్ సంచలనం ఇహ్సానుల్లా పాకిస్తాన్ తరపున సత్తా చాటేందుకు సిద్దమవుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో తన స్పీడ్ బౌలింగ్‌తో అందరి దృష్టిని ఇహ్సానుల్లా ఆకట్టుకుంటున్నాడు .
ప్రస్తుతం జరగుతున్న ఈ లీగ్‌లో ఇహ్సానుల్లా.. గంటకు 150 కి.మీ వేగంతో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ లీగ్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతడు 12 వికెట్లు పడగొట్టాడు. ఇక తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా తన మనసులోని మాటను బయటపెట్టాడు.
భారత స్పీడ్‌స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బాల్(156 కి.మీ వేగం) రికార్డ్ బ్రేక్ చేస్తా అంటూ ఇహ్సానుల్లా సవాలు విసిరాడు. ఉమ్రాన్ రికార్డును బ్రేక్ చేసి 160 కి.మీ వేగంతో బంతిని సంధిస్తానని ఇహ్సానుల్లా ప్రగల్భాలు పలికాడు. అంతేకాకుండా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని ఒక్క సారైనా ఔట్ చేయడమే తన లక్ష్యమని అతడు పేర్కొన్నాడు.
నీకు అంత సీన్ లేదులే..
ఇక ఇహ్సానుల్లా చేసిన వాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. "నీకు అంత సీన్ లేదులే.. ముందు జట్టులో చోటు సంపాందించుకో" అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేస్తున్నారు.
చదవండి: PSL 2023: కోపంతో ఊగిపోయిన పాకిస్తాన్ దిగ్గజం.. సోఫాను తన్నుతూ! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment