IPL 2023: Nitish Rana hammers Umran Malik for six consecutive boundaries - Sakshi
Sakshi News home page

IPL 2023: కోల్‌కతా కెప్టెన్‌ విధ్వంసం.. 6 బంతుల్లో 6 బౌండరీలు! పాపం ఉమ్రాన్‌

Published Sat, Apr 15 2023 11:48 AM | Last Updated on Sat, Apr 15 2023 1:23 PM

 Nitish Rana hammers Umran Malik for six consecutive boundaries - Sakshi

PC:IPl.com

ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో కేకేఆర్‌ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓటమిపాలైనప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్‌ నితీష్‌ రాణా మాత్ర తన అద్భుత ఇన్నింగ్స్‌తో అందరినీ అకట్టుకున్నాడు. 229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్‌ రాణా ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫోర్లు,సిక్సర్లతో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించాడు. ముఖ్యంగా ఎస్‌ఆర్‌హెచ్‌ స్పీడ్‌ స్టార్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు చుక్కలు చూపించాడు. 6 ఓవర్‌ వేసిన ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో రాణా వరుసగా ఆరు బౌండరీలు బాదాడు. 

అందులో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. దీంతో ఈ ఓవర్‌లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఓవర్‌ ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 41 బంతులు ఎదుర్కొన్న రాణా.. 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు. అద్భుతంగా ఆడిన రాణా 17 ఓవర్‌లో నటరాజన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.
చదవండిIPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్‌ ఆటగాడిగా


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement