ఐపీఎల్‌లో అదరగొట్టిన స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కు భారత జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగుతోన్న టీ20 సిరీస్‌లో భారత జట్టులో ఉమ్రాన్ భాగంగా ఉన్నాడు. అయితే ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20కు తుది జట్టులో ఉమ్రాన్‌కు చోటు దక్కలేదు. ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత్ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది.
ఈ క్రమంలో బీసీసీఐ యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఆర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లను ప్రోటిస్ సిరీస్‌కు బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్‌ను ఉద్దేశించి భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు మాలిక్‌ను భారత జట్టులోకి తీసుకోకూడదని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
"ఉమ్రాన్‌కు ఇంకా టీ20ల్లో అంత అనుభవం లేదు. ఉమ్రాన్‌ను మరింత తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీ20 ప్రపంచకప్‌కు అతడిని భారత జట్టుకు ఎంపిక చేయవద్దు. అతడిని వైట్-బాల్ క్రికెట్ క్రికెట్‌లో కొన్నాళ్లపాటు ఆడనివ్వండి. అదే విధంగా టెస్టులో కూడా ఉమ్రాన్‌కు అవకాశం ఇవ్వాలి. అతడు రెడ్ బాల్ క్రికెట్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి" అని రవిశాస్త్రి అని పేర్కొన్నాడు.
చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం
Comments
Please login to add a commentAdd a comment