ఓనం పూట బీఫ్ తిన్న నటి.. విమర్శలు
సాక్షి, కొచ్చి: మళయాళం స్టార్ నటి బీఫ్ వివాదంలో చిక్కుకుంది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డు పొందిన సురభి లక్ష్మి ఓనం పండగ రోజు బీఫ్ తిన్న కారణంగా విమర్శలు ఎదుర్కుంటోంది.
కొన్నాళ్ల క్రితం తన స్నేహితులతో ఓ హోటల్‌కు వెళ్లిన సురభి బీఫ్ ఫ్రైను ఎంజాయ్ చేస్తూ ఓ సెల్ఫీ దిగి దానిని తన ఫేస్బుక్లో షేర్ చేసింది. అయితే వాటిని చూపిస్తూ ఓనం పూట ఓ ఛానెల్ వాళ్లు ఓ కార్యక్రమం ప్రసారం చేశారు. అంతే శాఖాహర ఫెస్టివల్ అయిన ఓనం పూట గోమాంసం తింటావా? అంటూ సోషల్ మీడియాలో ఆమెపై తీవ్ర పదజాలంతో విమర్శలు మొదలయ్యాయి.
అయితే అది ఓనం కంటే మూడు వారాల కంటే ముందే దిగానని, కొజికోడ్‌లోని తన ఫెవరెట్ హోటల్‌కు వెళ్లినప్పుడు దిగిన ఫోటో అని సురభి క్లారిటీ ఇచ్చారు. ‘ఓ కార్యక్రమం కోసం నేను అక్కడికి వెళ్లాను. బాగా ఆకలేసింది. ఆ సమయంలో నేను తింది బీఫా?చికెనా? పంది మాంసమా? అని ఆలోచించలేదు. మనిషికి ఆకలి ముఖ్యం. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. ఆ కార్యక్రమం ఓనం రోజు ప్రసారం కావటం అని ఆమె చెప్పారు.