నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రశాంతంగా పండుగలు జరపుకోవాలని ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్ సూచించారు. ఉగాది, రంజాన్ ఒకేసారివస్తున్న క్రమంలో హిందూ, ముస్లింలు శాంతియుత వాతావరణంలో పండుగలను నిర్వహించుకోవాలన్నారు.నాగిరెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో వివిధ మతస్తులతోపాటు మండలకేంద్రంలో జరిగే ఉగాది జాతర ఉత్సవాల నిర్వాహణపై శుక్రవారం ఆయన శాంతికమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది జాతరలో భాగంగా నిర్వహించబోయే ఎడ్లబండ్లలో పాల్గొనే ప్రతిబండివారు తమకు, తోటి బండివారికి సహకరించాలన్నారు. దీంతోపాటు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాతరలో దుకాణాలను ఏర్పాటు చేసుకునేలా మార్కింగ్ ఇవ్వాలని ఎస్సై మల్లారెడ్డికి సూచించారు.తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎస్సై మల్లారెడ్డి, ఆలయకమిటీ సభ్యులు, పలువురు మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో మండల కేంద్రానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ ఆలయాల కమిటీ అధ్యక్షులు, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన శాంతికమిటీ సమావేశంలో ఎస్సై స్రవంతి మాట్లాడారు. ఉగాది రోజున ఎడ్లబండ్ల ప్రదర్శన ప్రశాంతంగా జరిగేలా సహకరించాలన్నారు.ఏఎస్సై జానీపాషా, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా పండుగలు జరుపుకోవాలి