చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి

Apr 2 2025 1:25 AM | Updated on Apr 2 2025 1:25 AM

చెట్ట

చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి

సిరికొండ: మండలంలోని తూంపల్లికి చెందిన దాసరి రజనీశ్‌(38) కొబ్బరి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై ఎల్‌ రామ్‌ మంగళవారం తెలిపారు. రజనీశ్‌ కొబ్బరికాయలు తెంపడానికి సోమవారం కొబ్బరి చెట్టు పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడి గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

అక్బర్‌నగర్‌ శివారులో

కారు బోల్తా

రుద్రూర్‌: మండలంలోని అక్బర్‌నగర్‌ శివారులో మంగళవారం కారు బోల్తా పడింది. కాగా కారులో ఉన్న వ్యక్తి పారిపోయినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రుద్రూర్‌ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి స్థానికుల ద్వారా ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఓ పోలీసు వాహనం వెంబడిస్తున్న సమయంలో కారు బోల్తా పడినట్టు తెలిసింది. కారును పోలీసులు ఎందుకు వెంబడించారు. కారు బోల్తాపడగానే అందులో ఉన్న వ్యక్తి ఎందుకు పారిపోయాడనేది వివరాలు తెలియరాలేదు. ఈ విషయమై స్థానిక ఎస్సై సాయన్న ను వివరణ కోరగా ప్రమాదానికి గురైన కారును రుద్రూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించామని, వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

పేకాట స్థావరంపై దాడి

బాన్సువాడ రూరల్‌: మండలంలోని కొయ్యగుట్ట శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై అశోక్‌ తెలిపారు. పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

చెట్టు పైనుంచి పడి  యువకుడి మృతి1
1/1

చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement