ఖలీల్‌వాడి: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ రోడ్డులోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతానికి చెందిన షేక్ గౌస్‌పై ముగ్గురు యువకులు బుధవారం సాయంత్రం కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ షేక్ గౌస్‌ను జీజీహెచ్‌కు తరలించారు. పాతకక్షల నేపథ్యంలోనే గౌస్‌పై యువకులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కత్తితో బెదిరించిన యువకుడి అరెస్టు..
ఖలీల్‌వాడి: డబ్బుల కోసం కత్తితో బెదిరించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి బుధవారం తెలిపారు. నగరంలోని అహ్మద్‌పురా కాలనీకి చెందిన షేక్ అల్తాఫ్ గత నెల 31న బోధన్ రోడ్‌లోని దుర్గా వైన్స్ వద్ద సతీశ్ రెడ్డి, కోలం నాగరాజును కత్తితో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. వైన్స్ యజమాని పసునూరి విశ్వాక్‌కాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అల్తాఫ్‌పై గతంలో మహారాష్ట్రలోని ముథ్కేడ్ పోలీస్‌స్టేషన్‌లో హత్యానేరం కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
కత్తితో దాడి చేసిన వ్యక్తి..
ఖలీల్‌వాడి: నగరంలోని నాల్గో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. గత నెల 31న రాత్రి 11:30 గంటలకు పాటిగల్లీకి చెందిన మహమ్మద్ ఖలీమ్ అదే కాలనీకి చెందిన అబ్బాస్ అలీ బేగ్‌ను గాయపరిచాడన్నారు. అబ్బాస్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
నగరంలో కత్తిపోట్ల కలకలం