
ఎల్లారెడ్డిలో పిల్లర్లకే పరిమితం
ఎల్లారెడ్డి పట్టణంలోనూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి అలాగే ఉంది. రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. బిల్లుల సమస్యతో పిల్లర్లు, బీమ్‌లు వేసి వదిలేశారు. పనులు తిరిగి ఎ ప్పుడు మొదలుపెడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ నడిబొడ్డున నిర్మాణాలు చేపట్టినా.. అవి పూర్తి కాకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఎల్లారెడ్డిలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు