కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్, ఆర్మీ ఉద్యోగం సాధించిన దివ్య, కె అజయ్‌ను ఆదివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు సున్నపు సత్యనారాయణ, కొల్మి సురేశ్‌రెడ్డి, యూనుస్, కొలిమి భీంరెడ్డి, కె రాజ్‌కుమార్‌రెడ్డి, సీహెచ్ రాజేందర్‌రెడ్డి, కె ప్రభాకర్, ఆర్ స్వామి, జి లింగారెడ్డి, బి శ్యాంరావు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఘనంగా మల్లన్న జాతర
భిక్కనూరు: మండల కేంద్రంలో మల్లన్న జాతర ఆదివారం జరిగింది. అతిపురాతనమైన మల్లన్న ఆలయంలో భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాంపూర్ తండాలో పౌరాదేవి పీఠాధిపతి పర్యటన
బాన్సువాడ రూరల్: మండలంలోని రాంపూర్ తండాలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్‌సింగ్ కుటుంబాన్ని ఆదివారం మహారాష్ట్రలోని పౌరాదేవి పీఠాధిపతి, ఎమ్మెల్సీ శ్రీబాబుసింగ్ పరామర్శించారు. అంబర్‌సింగ్ గిరిజన సమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేశారు. ఆయన వెంట బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు నేనావత్ బద్యానాయక్, రణజ్యనాయక్, ప్రకాశ్, ఫకీరా నాయక్, చాజ్యనాయక్, చందర్, రామురాథోడ్ తదితరులు ఉన్నారు.

పలువురికి సన్మానం

రాంపూర్ తండాలో పౌరాదేవి పీఠాధిపతి పర్యటన