
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
కామారెడ్డి క్రైం: రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. గడిచిన మూడు నెలల కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల వివరాలు తెలుసుకుని కారణాలపై ఆయా అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై పరిమితికి లోబడి వాహనాల వేగం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పీడ్ గన్‌ల ద్వారా వేగాన్ని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై దృష్టి సారించాలని, అతి వేగం కారణంగా జరిగే ప్రమాదాలు, కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
జిల్లాలో 28 బ్లాక్ స్పాట్‌లు
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై
ప్రత్యేక దృష్టి సారించాలి
హైవేలపై వాహనాలు పార్కింగ్
చేసేవారిపై చర్యలు తీసుకోవాలి
రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న 28 బ్లాక్ స్పాట్‌లను గుర్తించామమని ఎస్పీ రాజేశ్‌చంద్ర తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. ఎక్కువగా రాత్రి 8 గంటల తర్వాత, వేకువజామున సమయాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందన్నారు. మైనర్‌లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. వాహనదారులు హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంత్‌రావు, వైద్య ఆరోగ్య, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, పీఆర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.