రవాణా శాఖ ఆదాయం అదిరింది | - | Sakshi
Sakshi News home page

రవాణా శాఖ ఆదాయం అదిరింది

Apr 3 2025 1:24 AM | Updated on Apr 3 2025 1:24 AM

రవాణా

రవాణా శాఖ ఆదాయం అదిరింది

కేక్‌ కట్‌ చేస్తున్న డీటీవో శ్రీనివాస్‌రెడ్డి

కామారెడ్డి క్రైం: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయాన్ని రాబట్టడంలో జిల్లా రవాణా శాఖ అద్భుత పనితీరును ప్రదర్శించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రవాణా శాఖకు రూ. 68.19 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం రూ. 73 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 92.04 శాతం పూర్తి చేశామని జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించడంలో కృషి చేసిన తమ శాఖ సిబ్బందిని అభినందించారు. బుధవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఆదాయం ఇలా..

2023–24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ. 63 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం ఏటా 16 శాతం లక్ష్యాన్ని పెంచుతుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాకు రూ. 73 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. అన్ని రకాల ట్యాక్సులు, ఫీజుల రూపంలో గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 68.19 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ప్రధానంగా ప్రత్యేక తనిఖీల ద్వారా 9.64 కోట్లు, గ్రీన్‌ ట్యాక్స్‌ రూపంలో రూ. 79.83 లక్షలు, సర్వీస్‌ చార్జీల రూపంలో రూ. 2.17 కోట్లు, ఫీజుల రూపంలో రూ. 7.35 కోట్లు, లైఫ్‌ ట్యాక్సుల రూపంలో రూ. 38.35 కోట్లు, త్రైమాసిక ట్యాక్స్‌ల రూపంలో రూ. 9.89 కోట్ల ఆదాయం వచ్చింది.

గతేడాదికంటే రూ. 5 కోట్లు అదనంగా..

గతేడాదికంటే ఈసారి రూ. 5.06 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేక తనిఖీల ద్వారా రూ. 3.69 కోట్లు, గ్రీన్‌ ట్యాక్స్‌ రూపంలో రూ. 6.26 లక్షలు, సర్వీస్‌ చార్జీలు రూ. 6.92 లక్షలు, ఫీజుల రూపంలో రూ. 25.05 లక్షలు, లైఫ్‌ ట్యాక్సుల రూపంలో రూ. 71.12 లక్షలు, త్రైమాసిక ట్యాక్స్‌ల రూపంలో రూ. 23.39 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.

ఆర్థిక సంవత్సరంలో

రూ. 68.19 కోట్ల ఆదాయం

రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో

జిల్లా రవాణా శాఖ

వాహనదారులకు అవగాహన కల్పిస్తూ..

వాహనాలకు సంబంధించిన ట్యాక్సులను సకాలంలో చెల్లించకపోతే ఎలాంటి నష్టా లు ఉంటాయో వాహన దారులకు వివరించడానికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతతో పాటు, ఫీజులు, ట్యాక్సుల విసయమై అవగాహన కల్పించాం. దీంతో సత్ఫలితాలు వచ్చాయి. ఆదాయం విషయంలో జిల్లా రవాణా శాఖ ద్వితీయ స్థానంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, డీటీవో, కామారెడ్డి

రవాణా శాఖ ఆదాయం అదిరింది1
1/1

రవాణా శాఖ ఆదాయం అదిరింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement