బాన్సువాడ రూరల్: ముదిరాజ్‌లు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని బోర్లం గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాదిరెడ్డి రమేశ్ అన్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం గ్రామంలోని ముదిరాజ్ సంఘ భవనం వద్ద ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బొంబాయి హన్మాండ్లు, టేకుల రమేశ్, గంగాధర్, సింగరి సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ధర్మారెడ్డిలో..
నాగిరెడ్డిపేట: మండలంలోని ధర్మారెడ్డిలో ముదిరాజ్ కులస్తులు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఉగాదిని పురస్కరించుకొని జెండాను ఎగురవేశారు. సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.