కామారెడ్డి క్రైం : రాజీవ్ యువ వికాసం పథకంపై అ వగాహన కల్పించి, వీలైనంత ఎక్కువమంది దర ఖాస్తు చేసుకునేలా చూడాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వీడియో కాన్ఫరె న్స్ ద్వారా మాట్లాడారు. అర్హులైన వారు 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. ఈ ప థకంలో లబ్ధిదారులకు రూ. 50 వేలలోపు రుణాల కు 100 శాతం, రూ.లక్షలోపు రుణాలకు 90శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు 70 శాతం రా యితీ లభిస్తుందని తెలిపారు. కుటుంబంలో ఒక్కరి కే ఈ పథకం వర్తిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో వార్షికాదాయం రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలలోపు ఉ న్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖా స్తు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలను ము న్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాల న్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి నుంచి క లెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవేందర్, ప రిశ్రమల శాఖ జీఎం లాలూనాయక్ పాల్గొన్నారు.
గడువులోగా దరఖాస్తు
చేసుకునేలా చూడండి
వీడియో కాన్ఫరెన్స్‌లో
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క


