నేడు కలెక్టర్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్
బస్వన్నపల్లిలో బావిలో పదుల సంఖ్యలో మోటార్లను ఏర్పాటు చేసుకున్న దృశ్యం
● భూగర్భ జలాలు
అడుగంటి అవస్థలు
● అంతటా తాగునీటికి కష్టాలు
● జిల్లా కేంద్రంలో నాలుగు
రోజులకోసారి ‘భగీరథ’
నీటి సరఫరా
● వాటర్ ట్యాంకర్లకు
పెరిగిన గిరాకీ
● నేడు కలెక్టర్‌తో
‘సాక్షి’ ఫోన్ ఇన్
కార్యక్రమం
జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో బోరుబావులు ఎత్తిపోతున్నాయి.
‘మిషన్ భగీరథ’ కూడా గొంతు తడపడం లేదు. దీంతో రోజురోజుకు తాగు నీటి కష్టాలు పెరిగి
పోతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందుముందు ఇంకెలా
ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటి కష్టాలను ఎప్పటికప్పుడు పాలకుల
దృష్టికి తీసుకువస్తున్న ‘సాక్షి’ మరో ప్రయత్నం మొదలుపెట్టింది. బుధవారం కలెక్టర్ ఆశిష్
సంగ్వాన్‌తో ఫోన్‌ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ నీటి సమస్యలను కలెక్టర్
దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకోనున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో పక్షం రోజులుగా తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు వట్టిపోతుండడంతో ప్రజలు దాహార్తితో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా లక్షపైచిలుకు జనాభా ఉన్న కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రత పెరిగింది. పట్టణానికి గతంలో శ్రీరాంసాగర్ నుంచి మిషన్ భగీరథ నీరు రోజు విడిచి రోజు సరఫరా అయ్యేది. ఇటీవలి కాలంలో నాలుగైదు రోజులకోసారి సరఫరా అవుతోంది. అది కూడా కొద్దిసేపే వస్తుండడంతో ఏ ఒక్క కుటుంబానికీ సరిపోవడం లేదు. పట్టణంలోని అశోక్‌నగర్, శ్రీరాంనగర్, విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, కాకతీయనగర్ తదితర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పడిపోయి వందలాది బోర్లు ఎత్తిపోయాయి. చాలా కుటుంబాలు నీళ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. నీటిని కొనుక్కోవాల్సి వస్తుండడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకు 5 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.5 వందలు తీసుకునేవారు. ఇప్పుడు రూ. 6 వందలకు పెంచారు. రెండు, మూడు అంతస్తులపైకి నీటిని ఎక్కించాలంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పట్టణంలో 50కి పైగా ప్రైవేటు ట్యాంకర్లు పొద్దస్తమానం తిరుగుతూనే ఉన్నాయి. మార్చి నెలలోనే పరిస్థితి ఉండడంతో ఎండాకాలమంతా ఎలా గడుస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మిషన్ భగీరథ గతంలోలాగే రోజు విడిచి రోజు నీరు వ చ్చేలా చూడాలని, లేదంటే మున్సిపాలిటీ ద్వారా ట్యాంకర్లను ఏర్పాటు చేసి నిత్యం ఇంటింటికి నీటి ని అందించాలని ప్రజలు కోరుతున్నారు.
రాజంపేటలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
ఫోన్ చేయాల్సిన నంబర్:
99087 12421
జిల్లాలో తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేందుకు ‘సాక్షి’ బుధవారం ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. ప్రజలు నిర్దేశిత సమయంలో ఫోన్ చేస్తే కలెక్టర్ సమాధానమిస్తారు.
తేది : 26–03–2025
(బుధవారం)
సమయం : మధ్యాహ్నం
12.00 నుంచి 1.00 గంట వరకు..
నేడు కలెక్టర్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్
నేడు కలెక్టర్‌తో ‘సాక్షి’ ఫోన్‌ఇన్
Comments
Please login to add a commentAdd a comment