భిక్కనూరు: విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌లో చేరి సమాజ సేవకు ముందుకురావాలని ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్రఅధికారి నరసింహాగౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ యునివర్సిటీ సౌత్‌క్యాంపస్‌లో నిర్వహించిన ఎయిడ్స్ సుఖవ్యాధుల అవగాహన సెమినార్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నివారణ తప్ప మందులేని ఎయిడ్స్‌తో పాటు సుఖవ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులదేన్నారు. తెలంగాణ యునివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ లైంగిక విద్యపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉపన్యాస వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు, ప్రశాంస ప్రతాలను అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుధాకర్‌గౌడ్, సౌత్‌క్యాంపస్ ఎన్‌ఎస్‌ఎస్ అధికారి అంజయ్య, అధ్యాపకులు లలిత, వీరభఽద్రం, నర్సయ్య,కనకయ్య సురేష్‌లు పాల్గొన్నారు.


