
‘జన్యుపరమైన కారణాలతోనే ఆటిజం’
కామారెడ్డి టౌన్: జన్యుపరమైన కారణాలతో ఆటిజం వ్యాధి వస్తుందని ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్‌కుమార్ అన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో వైద్యులు బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ హాల్ నుంచి ప్లకార్డులతో నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్‌కుమార్ మాట్లాడుతూ..మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు.. అందులో స్రవించే సెరోటోనిన్, డోపమిన్‌న్‌వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం, నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని వివరించారు.