మత్తు పదార్థాలను నిర్మూలించాలి
కామారెడ్డి క్రైం : నిషేధిత మత్తు పదార్థాల నిర్మూలనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు, విద్య, వైద్య ఆరోగ్య, ఎకై ్సజ్, వ్యవసాయ, డ్రగ్స్ నియంత్రణ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ మాదక ద్రవ్యాలు సరఫరా కాకుండా చూడాలన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను వేశామన్నారు. మాదక ద్రవ్యాలతో కలిగే నష్టాలపై విద్యార్థులకు క్విజ్, ఉపన్యాసం, వ్యాస రచన పోటీలను నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారికి వైద్యం అందించడానికి కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యేక సదుపాయం ఉందన్నారు. దానిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ అధికారులు, అటవీశాఖ అధికారులు చూడాలన్నారు.
5 కేసులు నమోదు చేశాం
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 5 గంజాయి కేసులను నమోదు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్, బిచ్కుంద, భిక్కనూరు, దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు. వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని కల్లు దుకాణాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు కలిసి కల్లు దుకాణాల్లో తనిఖీలు చేయాలన్నారు. కల్లు శాంపిళ్లు సేకరించి ల్యాబ్ లకు పంపాలని, ఆల్ప్రాజోలం ఉన్నట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 87126 86133 నంబర్‌కు గానీ టోల్ ఫ్రీ నంబర్ 1908 కి గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం యాంటీ డ్రగ్స్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌లను ఆవిష్కరించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీటీవో శ్రీనివాస్‌రెడ్డి, డీఈవో రాజు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, డీఏవో తిరుమల ప్రసాద్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాజారెడ్డి, ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
అధికారులు సమన్వయంతో
పనిచేయాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment