
రసవత్తరంగా కుస్తీ పోటీలు
బాన్సువాడ/ గాంధారి: ఉగాది పండగను పురస్కరించుకుని పలు గ్రామాల్లో నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా మారాయి. బాన్సువాడ మండలంలోని పోలీస్టేషన్ సమీపంలో కుస్తీ పోటీలు నిర్వహించారు.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు యామ రాములు, అవారి గంగారాం, యాట వీరేశం, పోగు నారాయణ, శశికాంత్, పర్తు నారాయణ తదితరులు ఉన్నారు. గాంధారి మండలం నేరల్ గ్రామంలో ఉగాది సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. విజేతలకు గ్రామ కమిటీ, గ్రామస్తులు నగదు బహుమతులు అందజేశారు.