లింగంపేట/ఎల్లారెడ్డి/సదాశివనగర్ : లింగంపేట బాలుర ఉన్నత పాఠశాల, మైనారిటీ గురుకుల పాఠశాలలో కొనసాగుతున్న పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఎల్లారెడ్డి సీఐ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో పది పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎంఈవో వెంకటేశం అన్నారు. పట్టణంలోని సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ యూసుఫ్ తనిఖీ చేశారని పేర్కొన్నారు. సదాశివనగర్‌తో పాటు కల్వరాల్ పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని ఫ్లయింగ్ సా్‌వ్డ్ తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్‌కు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.