
కృత్రిమమేధ ద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావం
తెయూ(డిచ్‌పల్లి): కృత్రిమమేధ ద్వారా సమాజంపై అనుకూలత కంటే ప్రతికూల ప్రభావం పడుతోందని తెలంగాణ యూనివర్సిటీ మాస్ కమ్యూనికేషన్ అధ్యాపకుడు, సోషల్‌సైన్స్ డీన్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ అన్నారు. పీస్ జర్నలిజం స్టడీస్ అంశంపై సౌత్‌కొరియా దేశ రాజధాని సియోల్‌లో హెచ్‌డబ్ల్యూపీఎల్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరై జూమ్ ద్వారా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమమేధ ద్వారా సృష్టించిన వీడియోలు వైరల్ కావడం వల్ల కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా తయారయ్యాయన్నారు. వాటి విశ్వసనీయతపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. సమాజాన్ని అశాంతికి గురిచేసే అంశాలపై నియంత్రణకు ప్రత్యేక మెకానిజం అవసరమన్నారు. పౌరుల హక్కుల రక్షణకు, వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన విధంగా చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో వివిధ దేశాల నుంచి వందకుపైగా ప్రతినిధులు హాజరయ్యారు.
తెయూ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్, సోషల్‌సైన్స్ డీన్ ఘంటా చంద్రశేఖర్