
వక్ఫ్ బిల్లుపై అనవసర రాద్ధ్దాంతం
కామారెడ్డి టౌన్: దేశంలోఅన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధ్దాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వక్ఫ్ బిల్లు కారణంగా ముస్లిములకు ఎటువంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలోని ప్రతి బూత్‌లో ఘనంగా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేయాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, పైలా కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, నాయకులు సంతోష్ రెడ్డి, రవీందర్, బాల్ రాజు, శ్రీధర్, సంపత్, భూపాల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.