నస్రుల్లాబాద్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డిరూరల్/లింగంపేట: జిల్లాలోని పలు గ్రామాల్లో ఉగాది ఉత్సవాల్లో భాగంగా సోమవారం వీడీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో జరిగిన పోటీల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మల్లయోధులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి గ్రామ కమిటీ సభ్యులు నగదు బహుమతి అందించారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి మొదలుకొని రూ.2000 వరకు పోటీలు జరిగాయి. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీలకు ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాలకు చెందిన మల్లయోధులు హాజరయ్యారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి 3 తులాల వెండి చైన్ వరకు పోటీలను నిర్వహించారు. లింగంపేట మండలం ముంబోజిపేట గ్రామంలో టెంకాయ కుస్తీ నుంచి వెండి కడెం వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. విజేతలకు గ్రామ పెద్దలు నగదు బహుమతులు అందజేశారు.
నేడు కోమలంచ గ్రామంలో..
నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కుస్తీ పోటీలకు మల్ల యోధులు తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామస్తులు కోరారు.
రేపు లింగంపేటలో..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బుధవారం కుస్తీ పోటీ లు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం రథోత్సవం, సాయంత్రం కుస్తీపోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలకు కుస్తీ వీరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
రసవత్తరంగా కుస్తీ పోటీలు
రసవత్తరంగా కుస్తీ పోటీలు
రసవత్తరంగా కుస్తీ పోటీలు