ఖలీల్‌వాడి/బోధన్‌రూరల్: బోధన్ రూరల్ మండలంలోని మందర్నా ఇసుక పాయింట్‌పై టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై గోవింద్, స్పెషల్‌పార్టీ సిబ్బంది దాడి చేశారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వారు సోమవారం అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్న తొమ్మిది టిప్పర్లతోపాటు మూడు పొక్లెయిన్లను స్వాధీనం చేసుకున్నారు. 12మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకుని తదుపరి చర్య నిమిత్తం బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ అంజయ్య తెలిపారు.
నిబంధనలు పాటించని వ్యాపారులు
మందర్నా ఇసుక పాయింట్ నుంచి ప్రభుత్వ పనుల కోసం ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కూలీల ద్వారా ట్రాక్టర్లలలో ఇసుకను తరలించడానికి అవకాశం ఉంటుంది. కానీ టిప్పర్లలలో నిబంధనల కంటే అదనంగా 10 టన్నుల వరకు ఇసుకను తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి బోధన్ పరిసర ప్రాంతాల వరకు మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంటుంది. కానీ నిజామాబాద్ వరకు తరలిస్తున్నారు. అధికారులు ఇసుక తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని బోధన్ ప్రజలు కోరుతున్నారు.
9టిప్పర్లు, 3 పొక్లెయిన్లు స్వాధీనం
12మంది అరెస్టు