కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియా పరిధిలో సోమవారం నాటికి 65.54 శాతం ఆస్తిపన్నులు వసూలయ్యాయి. బల్దియాలో రూ.13.56 కోట్ల పనులు వసూలు చేయాల్సి ఉండగా.. ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ. 8.89 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. ఇంకా రూ. 4.67 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. మొండి బకాయిలనూ వసూలు చేస్తామని మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ రవిగోపాల్‌రెడ్డి తెలిపారు.
వాటర్ ప్లాంట్ ప్రారంభం
బీబీపేట : శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో ఏ ర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌ను సోమవారం ఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామస్తులకు శుద్ధమైన తాగునీటిని అందించడం కోసం సుభాష్‌రెడ్డి రూ. 3 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చే యించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్ ఫౌండేష న్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రేషన్ షాపులకు చేరిన సన్నబియ్యం
బాన్సువాడ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అమలుకోసం సోమవారం బాన్సువాడ మండలానికి సన్న బియ్యం చేరాయి. బాన్సువాడ ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో ఉన్న 59 రేషన్ దుకాణాలకుగాను 650 టన్నుల బియ్యం పంపిణీ చేశారు.
ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం సంచుల్లో రెండు, మూడు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులందరూ సన్న బియ్యం తీసుకెళ్తారని, బియ్యం తక్కువగా రావడంతో వాటిని ఎలా భర్తీ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉచితంగా పాలిసెట్ కోచింగ్
నిజామాబాద్‌అర్బన్: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ తెలిపారు. సోమవారం ఆయన నిజామాబా ద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, నగరంలోని ఎస్‌ఎస్‌ఆర్ జూనియర్ కళాశాలలో ఉచిత తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఆసక్తి గల విద్యార్థులు పేర్లను ఏబీవీపీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో పరిషత్ నగర కార్యదర్శి బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేందర్, దుర్గాదాస్, రంజిత, వినోద్, ఇంద్రసేన, జయేంద్రవర్ధన్ అలంకార్ పాల్గొన్నారు.

రేషన్ షాపులకు చేరిన సన్నబియ్యం