ముగిసిన గల్ఫ్ మృతుడి అంత్యక్రియలు
మోర్తాడ్: ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన ఈర్గల గంగాధర్(44) ఇటీవల యూఏఈలోని అబుదబిలో ప్రమాదవశాత్తు మృతిచెందగా, మంగళవారం మృతదేహం స్వగ్రామానికి రాగా, అంత్యక్రియలు పూర్తయ్యాయి. గల్ఫ్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న గంగాధర్ శనివారం బైక్‌పై వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కంపెనీ యాజమాన్యం, గంగాధర్ సన్నిహితులు మృతదేహంను ఇంటికి తరలించడానికి వేగంగా స్పందించడంతో మూడురోజుల్లోనే మృతదేహం స్వగ్రామానికి చేరింది. గ్రామస్తులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment