బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి
కామారెడ్డి టౌన్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి(డీసీపీవో) స్రవంతి కోరారు. సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రోటరీ ఆడిటోరియంలో వివిధ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల బాలికల అక్రమ రవాణా, బాలికలపై జరుగుతున్న హింసను అడ్డుకోవాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఇందుప్రియ పిలుపునిచ్చారు. అనంతరం డీసీపీవోను సన్మానించారు. సాధన స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మురళీమోహన్, ప్రతినిధులు వెంకటేశ్, రాజేందర్, సౌజన్య, గిరిజ, అనూష, మమత తదితరులు పాల్గొన్నారు.
పదిలో జోరుగా మాస్ కాపీయింగ్
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు అడ్లూర్ ఎల్లారెడ్డి, కల్వరాల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన టెన్త్ పరీక్ష కేంద్రాల్లో జోరుగా మాస్ కాపీయింగ్ జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. పరీక్షా పత్రాన్ని బయటకు తీసుకొచి ప్రశ్నలకు సంబంధించిన జవాబులను గదుల్లోకి పంపిస్తున్నారు. చిటీలను నేరుగా అడెండర్‌ల ద్వారా ఇన్విజిలేటర్‌లకు అందజేస్తున్నారని ప్రతిభ గల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.