
సర్టిఫికెట్ల జారీకి ఆన్‌లైన్ కష్టాలు
కామారెడ్డి టౌన్: మున్సిపల్‌కు సంబంధించి ధ్రువపత్రాలు జారీ చేసే వెబ్‌సైట్ సాంకేతికపరమైన లోపాలతో ఓపెన్ కావడం లేదు. దీంతో ఆయా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. బల్దియా కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారులు నిత్యం చక్కర్లు కొడుతున్నారు. 10 రోజులుగా ఎదురవుతున్న ఈ సమస్యతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వెబ్‌సైట్ లాగిన్ చేయగానే ఎర్రర్ అని చూపుతోంది. సుమారు 600లకు పైగా ధ్రువపత్రాలు బల్దియా లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. నిత్యం దరఖాస్తుదారులు వారి సర్టిఫికెట్ల కోసం మున్సిపల్ అధికారులను, సిబ్బందిని నిలదీస్తున్నారు. ఈ విషయమై కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు.
పనిచేయని మున్సిపల్ వెబ్‌సైట్
పెండింగ్‌లో 600లకుపైగా
జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు
పది రోజులుగా ఇబ్బందులు
పడుతున్న దరఖాస్తుదారులు