నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేటలో ఆదివారం జరిగిన ఉగాది ఉత్సవాలలో అపశృతి చోటుచేసుకుంది. ఎడ్లబండ్ల ప్రదర్శన కొనసాగుతుండగా బండి నుంచి తాడును తెంపుకున్న ఎద్దు బెదిరిపోయి జనాలపైకి దూసుకెళ్లింది. కాగా ఉత్సవాలను తిలకించేందుకు మెదక్ జిల్లా తిమ్మాయిపల్లి నుంచి వచ్చిన కర్రోల నాగమణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గోపాల్‌పేటకు చెందిన రాజ్‌పేట మాధవి అనే మహిళ తలకు తీవ్రగాయమైంది. వీరితోపాటు మరికొంతమంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు.
రోగులకు పండ్ల పంపిణీ
బాన్సువాడ: వారధి స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ సభ్యులు ఆదివారం ప్రభుత్వం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సభ్యులు మహేందర్, సుధాకర్, వేణుగోపాల్, గోపాల్‌సింగ్ ఠాకూర్, కృష్ణ, కోటయ్య, శ్రీనివాస్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.


