
అనారోగ్యంతో మహిళా మోర్చా అధ్యక్షురాలి మృతి
బీబీపేట: మల్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు సన్నిధి అలియాస్ అష్షుని (25) బుధవారం మృతి చెందారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించారు. మృతురాలికి భర్త స్వామిగౌడ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని సంతాపం తెలిపారు.
గుడి గంట చోరీ
భిక్కనూరు: బస్వాపూర్‌లో పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న ఇత్తడి గంట చోరికి గురైందని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. గంటను చోరీ చేసిన యువకుడి చిత్రం సీసీ ఫుటీజీల్లో రికార్డయ్యిందని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.