● పలువురిపై కేసులు నమోదు
గాంధారి (ఎల్లారెడ్డి): మండల పరిధిలోని తిప్పారం గ్రామంలో శుక్రవారం వడ్డీ వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేసి పలు ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీలకు అప్పులు ఇస్తూ అమాయకుల వ్యవసాయ భూములను స్వాధీనం చేసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో సోదాలు చేసినట్లు తెలిపారు. సోలంకి సాయిరాం, ఊగిలే ఆనంద్‌రావు, బంగారువాడి బాలయ్య ఇళ్లలో పలు ప్రామిసరీ నోట్లు, దస్తావేజులు స్వాధీనం చేసుకుని ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.