నిజాంసాగర్: మహమ్మద్‌నగర్ మండలంలోని తెల్గాపూర్ శివారులో ఉన్న బొందల గడ్డ భూములను బుధవారం రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సర్వే చేశారు. ‘బొందల గడ్డకు రైతు బంధు’ శీర్షికన ఈనెల 23 న ‘సాక్షి’లో వచ్చిన కథనంపై అధికారులు స్పందించి, భూములను పరిశీలించారు. సర్వే అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహమ్మద్‌నగర్ మండల ఆర్‌ఐ పండరి, సర్వేయర్ శ్రీకాంత్, అటవీశాఖ బీట్ అధికారి శ్రీకాంత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
డీఎడ్ కళాశాలల కోసం
దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: జిల్లాలో ప్రైవేట్ డీఎడ్ కళాశాల స్థాపన కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన కళాశాలల స్థాపన, ప్రస్తుతం ఉన్న కళాశాలల అనుమతుల పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాల కోసం 63039 63931 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
కామారెడ్డి తైబజార్
@ రూ. 26 లక్షలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి బల్దియా కార్యాలయంలో బుధవారం తైబజార్, మేకలు, గొర్రెల సంతకు బహిరంగ వేలం నిర్వహించారు. తైబజార్‌ను అజ్మత్ అలీ అనే వ్యక్తి రూ. 26 లక్షలకు, మేకలు, గొర్రెల సంతను అబ్దుల్ రహుఫ్ రూ. 4 లక్షలకు దక్కించుకున్నారు. వచ్చే ఏడాది 31వ తేదీ వరకు టెండర్ కాలపరిమితి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తెలిపారు.
‘హిందీ జాతీయ
సమైక్యతను పెంపొందిస్తుంది’
కామారెడ్డి అర్బన్: బహుభాషల దేశంలో హిందీ జాతీయ సమైక్యతను పెంపొందిస్తుందని భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిందీ అసోసియేట్ లెక్చరర్ పవన్ పాండే పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హిందీ విభాగం ఆధ్వర్యంలో ‘హిందీ భాష –ఉపాధి అవకాశాలు’ అన్న అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో పవన్ పాండే మాట్లాడుతూ వైరుధ్యం లేకుండా హిందీ నేర్చుకున్నవారు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారన్నారు. హిందీతో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. హిందీలో ఉన్నత విద్యనభ్యసించడం ఉపాధి అవకాశాలు లభించడానికి సులువైన మార్గం అని కళాశాల హిందీ విభాగం అధిపతి జి.శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. విద్యార్థులు హిందీలో కవితలు వినిపించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, సుధాకర్, అధ్యాపకులు రాములు, ఫర్హీన్ ఫాతిమా, బాలాజీ, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


