ఏ పెళ్లికి వెళ్లినా స్టీల్ ప్లేట్‌లోనే భోజనం
మద్నూర్(జుక్కల్) : ఎక్కడ ఏపెళ్లికి వెళ్లినా స్టీల్ ప్లేట్‌లోనే భోజనం చేస్తానని మద్నూర్‌కు చెందిన తమ్మెవార్ అరవింద్ పేర్కొన్నాడు. మండలకేంద్రంలో గురువారం జరిగిన ఓ పెళ్లిలో స్టీల్ ప్లేట్‌లో భోజనం చేశాడు. సంవత్సరం నుంచి ఏ ఫంక్షన్‌కు వెళ్లినా ఇంటి నుంచి స్టీల్ ప్లేటు తీసుకువెళ్తానని, తనతో పాటు తన భార్య కూడా స్టీల్ ప్లేట్‌లోనే భోజనం చేస్తుందని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తమవంతు బాధ్యతగా ప్లాస్టిక్ విస్తరాకులు, గ్లాస్‌లు ఉపయోగించమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని ఆయన కోరారు. పర్యావరణాన్ని కాపాడేందుకు త్వరలో వెయ్యి స్టీల్ ప్లేట్లు కొనుగోలు చేసి మద్నూర్‌లో ఏ ఫంక్షన్ జరిగిన పంపిణీ చేస్తానని వెల్లడించారు.


