మద్నూర్(జుక్కల్) : విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ట్రాన్స్‌కో డీఈ గంగాధర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సోమవారం మూడు నూతన ట్రాన్స్‌ఫార్మర్‌లను ఆయన ప్రారంభించారు. ఈ ప్రాంతంలో అధిక లోడ్ ఉండడంతో వోల్టెజ్ సమస్య వస్తుండడం, వేసవికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా అవసరం ఉండడంతో అదనంగా ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్‌కో ఏడీఈ సంజీవన్‌రావ్, ఏఈ గోపికృష్ణ, సిబ్బంది స్వామి ఉన్నారు.
పాఠశాలల అభ్యున్నతికి
సహకారం
నిజాంసాగర్(జుక్కల్): పాఠశాలల అభ్యున్నతికి తల్లిదండ్రులు, గ్రామస్థులు, స్వచ్ఛంద సంస్థలు తమవంతు సహకారం అందించాలని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్ పటేల్ అన్నారు. సోమవారం మండలంలోని మాగి గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మైల్ స్టోన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు, సోలార్ బల్బులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుర్రపు. శ్రీనివాస్ పటేల్, శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయు రాలు షమీన, ఉపాధ్యాయులు ప్రవళిక, శైలజ తదితరులు ఉన్నారు.
గ్రంథాలయానికి
కుర్చీలు అందజేత
బాన్సువాడ : బాన్సువాడ గ్రంథాలయానికి కుర్చీలు, ప్యాడ్‌లను సోమవారం బీజేపీ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ గార్గె అందజేశారు. మినీ స్టేడియంలో కొనసాగుతున్న గ్రంథాలయంలో చదువుకునే వారి సౌకర్యం కోసం చల్లటి వాటర్ ట్యాంకుతో పాటు 20 కుర్చీలు, 20 ప్యాడ్‌లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం భవన నిర్మాణానికి రూ.60 లక్షలు మంజురైనప్పటికి పనులు ప్రారంభించడం లేదని అన్నారు.కార్యక్రమంలో నాయకులు అర్షపల్లి సాయిరెడ్డి, ర్యాల మోహాన్‌రెడ్డి, దావుగారి డాకయ్య, ప్రసాద్, రాజాసింగ్, సాయికిరణ్, బోడ లక్మణ్, శ్యాంకుమార్ తదితరులు ఉన్నారు.
ఏవో విజయ్‌కుమార్ మరణం తీరని లోటు
బాన్సువాడ : పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోగా పని చేసి బదిలీపై వెళ్లిన విజయ్‌కుమార్ మరణం తీరని లోటు అని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో విజయ్‌కుమార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ సహచర అధికారులతో కలుపుగొలుపుగా ఉండే విజయ్‌కుమార్ మృతి బాధకరమన్నారు. రెండు రోజుల క్రితమే ఎల్లారెడ్డి డివిజన్ కార్యాలయానికి బదిలీ అయ్యారని గుర్తు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, రెవిన్యూ అధికారులు సంగమేశ్వర్, అశోక్, ఆంజనేయులు, భాస్కర్ తదితరులున్నారు.
ఆకట్టుకున్న కుస్తీపోటీలు
బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన కుస్తీపోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు తమ ప్రతిభను చాటి బహుమతులు అందుకున్నారు. గ్రామంలో ప్రతి ఏటా పాడిపంట, ప్రజలు బాగుండాలని జాతర మహోత్సవం నిర్వహిస్తామని గ్రామకమిటీ అధ్యక్షులు పరిగె బాపురెడ్డి తెలిపారు. ఈసందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంజీవ్‌రెడ్డి, సాయిలు, పర్వయ్య, దుర్గారెడ్డి, శ్రీనివాస్, వీరేందర్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి
విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి
విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి
విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి