మాచారెడ్డి : మైసమ్మ చెరువు తండా పంచాయతీ పరిధిలోని దుర్గమ్మగుడి తండాలో నెలకొన్న నీటి సమస్యపై ‘నీటి కోసం తండ్లాడుతున్న తండా వాసులు’ అన్న శీర్షికన ఈ నెల 21న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తండా వాసులకు ఉదయం, సాయంత్రం ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నారు.
‘సలాబత్‌పూర్ ఆలయానికి భారీగా నిధులు’
మద్నూర్: సలాబత్‌పూర్‌లోని హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 70 కోట్లు మంజూరు చేసిందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిలు తెలిపారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రాంపటేల్‌ను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం భారీగా నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు హన్మండ్లు స్వామి, విఠల్ గురూజీ, రవి, ప్రజ్ఞకుమార్, రమేశ్, అముల్ తదితరులు పాల్గొన్నారు.
లారెక్కిన రైలు
భిక్కనూరు: పట్టాలపై వెళ్లాల్సిన రైలు.. లారీ ఎక్కింది. దీనిని చూసి రహదారిపై వెళ్తున్నవారు ఆశ్చర్యపోయారు. బుధవారం 44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు నుంచి నాగ్‌పూర్ వైపు భారీ లారీలో రైలు ఇంజిన్‌ను తరలించారు. భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. రైలు బోగీలను తీసుకెళ్తున్న లారీకి 96 టైర్లున్నాయి.
దుర్గమ్మ గుడి తండాలో ట్యాంకర్‌తో నీటి సరఫరా
దుర్గమ్మ గుడి తండాలో ట్యాంకర్‌తో నీటి సరఫరా
దుర్గమ్మ గుడి తండాలో ట్యాంకర్‌తో నీటి సరఫరా