వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు | - | Sakshi

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

Apr 2 2025 1:25 AM | Updated on Apr 2 2025 1:25 AM

వట్టి

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

నిజాంసాగర్‌(జుక్కల్‌): నిజాంసాగర్‌, మహమ్మద్‌ నగర్‌ మండలాల్లోని వెల్గనూర్‌, నర్సింగ్‌రావ్‌పల్లి, మంగ్లూర్‌, మల్లూర్‌ తండా, మల్లూర్‌, ఒడ్డేపల్లి, జక్కాపూర్‌, నర్వ, శేర్‌ఖాన్‌ పల్లి, సింగితం గ్రామాల పరిధిలో వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేసిన పంట పొలాలు ఎండుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో పంటలకు సాగునీరు అందడంలేదు. ప్రధానంగా వరి పంటపొలాలకు తీవ్రమైన నీటి కష్టాలు ఎదురవుతున్నాయి.

జొన్న, మొక్కజొన్న పంటలకు నీటి కొరత ఏర్పడినా పంట నష్టం తక్కువగా ఉంది. వరి పంట సాగు కోసం ఎకరానికి రూ. 25 వేల వరకు రైతులు పెట్టుబడి ఖర్చులు చేశారు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడి ఖర్చులతో పాటు ఆరుగాలం కష్టపడిన శ్రమ వృథా అవుతుందని రైతులు వాపోతున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టినా పంటలు పశువులకు మేతపాలవుతుండటంతో కర్షకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

నిజాంసాగర్‌ ఉమ్మడి మండలంలో

పడిపోయిన భూగర్భజలాలు

ఆందోళనలో రైతులు

పంట ఎండుతోంది

యాసంగి సీజన్‌లో నాలుగు బోర్ల కాడ ఆరు ఎకరాల్లో వరి, 1.5 ఎకరాల్లో జొన్న పంట వేశాను. బోర్లు ఎత్తిపోవడంతో పంట మొత్తం ఎండిపోతుంది. దోపుల్‌ పోసిన బోర్లు దోసేడన్ని కూడా పోస్తలేవు. పంట సాగు కోసం తెచ్చిన అప్పులు కుప్పగా మారాయి. ప్రభుత్వం స్పందించి పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – ఏముల కాశీరాం, శేర్‌ఖాన్‌పల్లి, రైతు

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు1
1/5

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు2
2/5

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు3
3/5

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు4
4/5

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు5
5/5

వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement