కామారెడ్డి క్రైం : కల్తీ కల్లులో వినియోగించే నిషేధిత మత్తు పదార్థం అల్ప్రాజోలంను సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని మద్నూర్ గ్రామా నికి చెందిన ఉదాలత్‌వర్ సురేశ్‌గౌడ్ ఇంటిపై ఆది వారం పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీ ల్లో 110 గ్రాముల అల్ప్రాజోలం పట్టుబడింది. సురేశ్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నిషేధిత అల్ప్రాజోలంను హైదరాబాద్ శివారు ప్రాంతంలోని నాచారంలో ఉండే వ్యాపారి దినేష్‌కుమార్ మొహంతి వద్ద నుంచి కొనుగోలు చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు సురేశ్‌ను వెంట తీసు కుని నాచారంలోని దినేష్ కుమార్ వద్దకు వెళ్లి విచా రించారు. నాచారంలోని టెంపుల్ ఆర్గానిక్ ల్యాబ్ లో ఉండే కృష్ణ అనే వ్యక్తి వద్ద నుంచి వారు అల్ప్రా జోలం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కృష్ణ అ ల్ప్రాజోలంను ఇతర ముడి సరుకులతో కలిపి త యారు చేసి సురేశ్‌గౌడ్‌తోపాటు మద్నూర్‌కు చెంది న శ్రీనివాస్‌గౌడ్‌కు చాలాసార్లు విక్రయించినట్లు పో లీసుల విచారణలో వెల్లడైంది. కృష్ణ వద్ద 153 గ్రా ముల అల్ప్రాజోలం, 4 సెల్‌ఫోన్లు, 8 రకాల ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సురేశ్‌గౌడ్, దినేష్ కుమార్ మొహంతి, కృష్ణలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్పీ తెలిపారు. శ్రీనివాస్‌గౌడ్ పరారీ లో ఉన్నాడని పేర్కొన్నారు.
ముగ్గురు నిందితుల రిమాండ్..
పరారీలో మరొకరు..
వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర


