● జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున
ఎడ్లబండ్ల ప్రదర్శన
● భారీగా తరలివచ్చిన జనం
కామారెడ్డి టౌన్ : ఉగాది పర్వదినం సంద ర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. వీక్లీమార్కెట్‌లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు విజయాలతో ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఆయా కుల సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధు లు ఎడ్లబండ్లను అందంగా ముస్తాబు చేసి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆలయాలచుట్టూ ప్రదక్షిణల అనంతరం పాంచ్ రస్తా, గర్ల్స్ హై స్కూల్, హరిజనవాడ మీదుగా పెద్దమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ అలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో 50కి పైగా ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. ప్రదర్శనను వీక్షించడానికి చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివా స్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్ల ప్రదర్శనను
ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేవీఆర్


