
కారు బోల్తా.. పలువురికి స్వల్ప గాయాలు
ఇందల్వాయి: చంద్రాయన్‌పల్లి శివారులో గురువారం ఉదయం కారు బోల్తా పడ్డ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. టోల్‌ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కి చెందిన ప్రహానంద రామేశ్వరి దంపతులు వారి కుమారుడు రఘుతో పాటు పదేళ్ల వయసున్న మనవరాలితో కలిసి కారులో బాసరకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు గుర్తించి టోల్‌ప్లాజా సిబ్బందికి సమాచారం అందించారు. వారిని టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో నిజామాబాద్‌కి తరలించారు. ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా చిన్న పాప కాలుకి తీవ్ర గాయమైనట్లు తెలిపారు.