
అన్నదాతకు అకాల దెబ్బ
బాన్సువాడ/నిజాంసాగర్/బిచ్కుంద/నస్రుల్లాబాద్/పెద్దకొడప్‌గల్/బాన్సువాడ రూరల్ : ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంట గురువారం కురిసిన వర్షానికి నేలవాలింది. బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో, జుక్కల్, మండడంలోని జుక్కల్ చౌరస్తా, కౌలాస్, శాంతాపూర్, గ్రామాల్లో, బిచ్కుంద మండలం వాజిద్‌నగర్, సీతారాంపల్లి, మనేపూర్ గ్రామాలలో, పెద్దకొడప్‌గల్ మండలంలో, బాన్సువాడ మండలం కొల్లూర్, సుల్తాన్‌పూర్ శివార్లలో చేతికొచ్చిన వరిపైరు నేలకొరిగింది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు గ్రామానికి చెందిన నర్సింలు అనే రైతు మొక్క జొన్న పంట 5 ఎకరాల మేర వర్షానికి నేల కొరిగింది.
కొన్ని చోట్ల వడగండ్లు పడటంతో ధాన్యం నేలరాలగా వరిఫైర్లు చీపురు కట్టలుగా మారాయి. బలమైన గాలులు, భారీ వర్షం దాటికి కొన్ని చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పొట్టదశ నుంచి కొతకు సిద్ధంగా ఉన్న వరి పంటపై వడగండ్ల వాన పడటంతో గింజలు పూర్తిగా రాలిపోయాయి. అలాగే రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అధికారులు పంటలను పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
జిల్లాలో ఈదురుగాలులతో
కూడిన వర్షం
నేలవాలిన పంటలు

అన్నదాతకు అకాల దెబ్బ

అన్నదాతకు అకాల దెబ్బ

అన్నదాతకు అకాల దెబ్బ