సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి ఆర్టీసీ డిపో అధికారుల తీరే వేరు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో బస్‌పాసుల జారీ విషయంలోనూ అదే నిర్లక్ష్యం కనపడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో వివిధ రాయితీలపై ప్రయాణించే వారికి ఇచ్చే బస్‌పాసుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బస్‌పాసుల జారీ కేంద్రంలో ప్రింటర్లు సరిగా పనిచేయవు. బస్‌పాసును లామినేషన్ చేసి ఇవ్వాల్సి ఉండగా, మిషన్ మూలన పడిందని తప్పించుకుంటున్నారు. ప్రింటింగ్, లామినేషన్ కోసమే ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు చేస్తారు. కానీ లామినేషన్ చేసి ఇవ్వడం లేదు. విద్యార్థులు, జర్నలిస్టులకు సంబంధించి బస్‌పాసులను లామినేషన్ చేసి ఇవ్వకుండా బయట చేయించుకోమని చెబుతున్నారు. కొందరు ఇదేమని ప్రశ్నిస్తే మిషన్ లేదని అంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నపుడు చేసి ఇవ్వాలి కదా అంటే నోరు మెదపడం లేదు.
ప్రింటర్లు సరిగా పనిచేయవు
ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు
లామినేషన్ చేసి ఇవ్వరు...