ఎల్లారెడ్డిరూరల్ : వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన బొమ్మర్తి లింగయ్య అలియాస్ ఏసుకు గతంలో ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి గ్రామానికి చెందిన శ్యామలతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు మైథిలి, అక్షర, కుమారుడు వినయ్ ఉన్నారు. శ్యామల అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన మరొకరిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి మధ్య మనస్పర్థలు రావడంతో నెలరోజలకే విడిపోయారు. అనంతరం లింగయ్య లింగంపేట మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన మౌనికను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక కూతురు జన్మించింది. ఆమె ఆరునెలల వయసులో అనారోగ్యానికి గురై మృతిచెందింది. సవతి పిల్లలైన మైథిలి, అక్షర, వినయ్‌లను సొంత పిల్లలుగా చూసుకుంటూ కాలం గడుపుతోంది.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు.
సెలవులకు ఇంటికి రావడంతో..
వరుస సెలవుల నేపథ్యంతో
ఇంటికి వచ్చిన పిల్లలు
చెరువు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదం
నీటమునిగి మృత్యువాత
ఒకే కుటుంబంలోని
నలుగురి మృతితో తీవ్ర విషాదం
వరుస సెలవులు ఆ పిల్లల పాలిట మృత్యుశరాలయ్యాయి. సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ముగ్గురు పిల్లలు చెరువు వద్దకు వెళ్లి ఆడుకుంటూ నీట మునిగారు. వారిని కాపాడే క్రమంలో పినతల్లి సైతం మృత్యువాతపడింది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ అగ్రహారంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
మెదక్‌లోని వెస్లీ పాఠశాలలో మైథిలి ఆరో తరగతి, అక్షర ఐదో తరగతి చదువుతున్నారు. వీరు అ క్కడే హాస్టల్‌లో ఉండేవారు. కుమారుడు వినయ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తర గతి చదువుతున్నాడు. రెండు రోజులు సెలవులు రావడంతో ఈనెల 26న లింగయ్య ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకునివచ్చాడు. శనివారం మౌనిక బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తూ పిల్లలను వెంట తీసుకువెళ్లింది. మౌనిక బట్టలు ఉతుకుతుండగా ముగ్గురు పిల్లలు చెరువులో దిగి స్నానాలు చేశారు. ఈ క్రమంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలు గుంతలో మునిగిపోతుండడాన్ని గమనించిన మౌనిక వారిని కాపాడేందుకు చెరువులో దిగి ఆమె సైతం నీటమునిగి చనిపో యి ఉంటుందని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూతుళ్లను సెలవులలో ఇంటికి తీసుకుని రాకపోయి ఉంటే వారు బతికే వారేమోనని గ్రామస్తులు, బంధువులు చర్చించుకున్నారు.
సెలవులే.. మృత్యు శరములై..


