ఎల్‌ఆర్‌ఎస్‌ను వేగవంతం చేయాలి
కామారెడ్డి టౌన్: ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఎల్‌ఆర్‌ఎస్ కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 25 శాతం రాయితీతో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఇచ్చిన గడువు ఈనెల 31 తో ముగియనుందన్నా రు. దరఖాస్తుదారులు త్వరగా ఫీజు చెల్లించి రాయి తీ పొందాలని సూచించారు. దరఖాస్తుదారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోనే ప్రొసిడింగ్స్ జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, టీపీవో గిరిధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment