కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు టీజీఎస్పీ ద్వారా నూతనంగా నియమితులైన లెక్చరర్లు బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్‌తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాంను లెక్చరర్లు ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ కళాశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత శాతం ఫలితాలు వచ్చేలా అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈఏపీఎస్‌ఈటీ, నీట్ లో కోచింగ్ ఇవ్వాలని, పోటీ పరీక్షల్లో విజయం సాధించే విధంగా కృషి చేయాలని తెలిపారు.


