హైదరాబాద్: ఈ నెల 20 వరకు హైదరాబాద్లోనూ, ఇతర జిల్లాలోనూ ముస్లిం రిజర్వేషన్లపై సంతకాల సేకరణ జరుగుతుందని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సేకరించిన 10 లక్షల సంతకాలను సమర్పిస్తామని ఆయన అన్నారు. సోమవారం హైదరాబాద్లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.
ఉత్తరఖండ్లో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేసినందుకు నిరసనగా ఈ నెల 6న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 9న ఇరిగేషన్ ప్రాజెక్ట్ల అవినీతిపై గాంధీభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టు చెప్పారు. 12న సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఉత్తమ్ వెల్లడించారు.
'9న ఇరిగేషన్ ప్రాజెక్ట్ల అవినీతిపై ప్రజెంటేషన్'
Published Mon, Apr 4 2016 3:05 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement