Kishan Reddy Power Point Presentation On Center's Aid To Telangana - Sakshi
Sakshi News home page

ఆ విషయంలో గుజరాత్ కంటే తెలంగాణకే ఎక్కువ నిధులు: కిషన్‌ రెడ్డి

Published Sat, Jun 17 2023 12:11 PM | Last Updated on Sat, Jun 17 2023 4:15 PM

Kishan reddy Power Point Presentation On Center Aid to Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర తెలియజేస్తూ ‘రిపోర్టు టు పీపుల్‌ పేరుతో’ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఆర్టీసి కళ్యాణ మండపంలో గత తొమ్మిదేళ్లలోతెలంగాణకు కేంద్ర ఇచ్చిన నిధులపై ప్రజలకు నివేదిక అందించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని, 9 ఏళ్లుగా తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను తెలియజేయడమే ఈ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఉద్దేశ్యమని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు. కేంద్రం చెప్పే లెక్కలు-రాష్ట్ర చెబుతున్న లెక్కలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ సర్కార్‌ నిరంతరం సహకరించిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.  గతంతో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని అన్నారు. కేంద్రం నుంచి వివిధ శాఖలు 5 లక్షల కోట్లు వచ్చాయని పేర్కొన్నారు.

‘మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్దపల్లి మినహా అన్ని జిల్లాలకు నేషనల్ హైవేల అనుసంధానం చేశారు . వీటి కోసం 1లక్ష 8వేల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేసింది. హైదరాబాద్‌కు గేమ్ చెంజర్‌గా కానున్న రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించిన భూ సేకరణ తొందరగా పూర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు. 
చదవండి: ప్రొ.హరగోపాల్‌పై కేసు ఎత్తేయండి: సీఎం కేసీఆర్‌ ఆదేశం

రైల్వేస్..
9 ఏళ్లలో రాష్ట్రంలో 37 వేల కోట్లకు పైగా రైల్వే లైన్లను డబ్లింగ్ ఏర్పాటు చేశాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించాం.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని కారణంగా ఎంఎంటీఎస్ రెండవ దశ చాలా రోజు ఆలస్యం అయ్యింది.
కాజీపేటలో రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి కేంద్రం అనుమతి ఇచ్చింది.
దీంతో 3వేల మందికి ఉపాధి లభిస్తుంది.
ప్రస్తుతం దేశంలో నడుస్తున్న 18 వందే భారత్ రైళ్లలో రెండు తెలంగాణలో నడుస్తున్నాయి.
ప్రజల అభిప్రాయ డిజైన్ మేరకు అనేక రైల్వే స్టేషన్ల అబివృద్ధి చేస్తున్నాం .

పౌర విమానయానం
భూ సేకరణ కారణంగా వరంగల్, కొత్తగూడెం విమానాశ్రయాల ఆలస్యం.
2014 తర్వాత తెలంగాణలో 11 సాగు నీటి ప్రాజెక్ట్ లకు ప్రత్యేక నిధులను కేంద్రం మంజూరు చేసింది.
ఇళ్ళ నిర్మాణానికి తెలంగాణకు నిధులు మంజూరు చేసినా ఖర్చు చేయలేదు.
రోడ్ల నిర్మాణంలో గుజరాత్ కంటే ఎక్కువ నిధులు తెలంగాణకే కేటాయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement