తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గురువారం ఇరిగేషన్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహిస్తారు. ఇందుకోసం సభలో మూడు స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సందర్శకుల గ్యాలరీలో కూర్చుని తిలకించేందుకు ఎమ్మెల్సీలను అనుమతించారు.
కాగా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను విపక్షాలు తప్పుపడుతున్నాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు వెళ్లాలా వద్దా? అనే విషయంపై టీటీడీపీ ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకోనుంది.