కాంగ్రెస్ వల్లే ప్రాజెక్టుల ఆలస్యం: హరీష్ రావు
హైదరాబాద్ : ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శనివారం ఉదయం శాసనమండలిలో హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే దిశగా ప్రభుత్వం పని చేస్తున్నదని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాజెక్టుల రిడిజైనింగ్ చేపట్టాల్సి వచ్చిందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా కృష్ణా జలాలను రాయలసీమకు తరలించారని గుర్తు చేశారు. కృష్ణా జలాల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కచ్చితంగా తీసుకువస్తామన్నారు. కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ నేతలు అడ్డుపడటం వల్లే ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల్లో ఆలస్యం ఏర్పడిందన్నారు.