అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై బుల్లెట్ల వర్షం | Meerut SHOCKER: BJP MLA Sangeet Som Residence Attacked With Bullets And Grenade | Sakshi
Sakshi News home page

అర్థరాత్రి ఎమ్మెల్యే ఇంటిపై బుల్లెట్ల వర్షం

Published Thu, Sep 27 2018 8:46 AM | Last Updated on Thu, Sep 27 2018 1:13 PM

Meerut SHOCKER: BJP MLA Sangeet Som Residence Attacked With Bullets And Grenade - Sakshi

బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ ఇల్లును పరిశీలిస్తున్న పోలీసులు

ఉత్తర ప్రదేశ్‌ : మీరుట్‌లో బుధవారం అర్థరాత్రి షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. బుల్లెట్లు, హ్యాండ్‌ గ్రెనేడ్‌తో సంగీత్‌ ఇంటిపై దాడి చేశారు. సెక్యురిటీ గార్డు ఇచ్చిన సమాచారం ప్రకారం అర్థరాత్రి 12.45 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది. 

స్పాట్‌లో ఖాళీ బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటికి ఫోరెన్సిక్‌ టీమ్‌ పరిశీలిస్తుందని మీరుట్‌ ఎస్‌ఎస్‌పీ తెలిపారు. హ్యాండ్‌ గ్రెనైడ్‌ను కూడా గుర్తించినట్టు చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణానికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, సెక్యురిటీ గార్డు క్యాబిన్‌ను, ఎమ్మెల్యే ఇంటి మెయిన్‌ గేట్‌ను లక్ష్యంగా చేసుకుని అర్థరాత్రి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటి పరిసర ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. దుండగులు ఎవరో కనుకొనే ప్రయత్నంలో ఉన్నారు. 

ఎమ్మెల్యే సోమ్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. రెండేళ్ల క్రితం కూడా తనకు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయని ఎమ్యెల్యే చెప్పారు. ఆ సమయంలో తనను గ్రెనైడ్‌ చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన బెదిరింపులేమీ రాలేదన్నారు.  


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement